Jagan: కొవిడ్ మహమ్మారి కట్టడిలో కలెక్టర్లదే కీలకపాత్ర: సీఎం జగన్

CM Jagan says district collectors will play key role to tackle with corona
  • జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం
  • కలెక్టర్లు కొవిడ్ ఆసుపత్రులను సందర్శించాలని సూచన
  • నిబంధనలు పాటించేలా చూడాలని స్పష్టీకరణ
  • కలెక్టర్లు అత్యుత్తమ పనితీరు కనబర్చాలని ఆకాంక్ష

రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకుని విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కొవిడ్ మహమ్మారిని కట్టడి చేయడంలో కలెక్టర్లదే కీలకపాత్ర అని స్పష్టం చేశారు. కలెక్టర్లు వ్యక్తిగతంగా కొవిడ్ ఆసుపత్రులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని సూచించారు.

జిల్లాలో శానిటైజేషన్, మాస్కులు ధరించడం, భౌతికదూరం వంటి నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. 104కు కాల్ చేసే ప్రతి ఒక్కరు సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొవిడ్ సంక్షోభ సమయంలో కలెక్టర్లు అత్యుత్తమ పనితీరు కనబర్చాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News