India: దేశవ్యాప్తంగా 551 పీఎస్​ఏ ఆక్సిజన్​ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం నిధులు

  • పీఎం కేర్స్ ఫండ్స్ నుంచి విడుదల
  • జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు
  • ఆక్సిజన్ కొరత తీరుతుందని పీఎంవో ప్రకటన
  • వీలైనంత త్వరగా అందుబాటులోకి వస్తాయని వెల్లడి
551 oxygen generation plants to be set up across India through PM Cares

దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రమవుతుండడంతో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. డీఆర్డీవో టెక్నాలజీ అయిన ప్రెజర్ స్వింగ్ అడ్జార్ప్షన్ (పీఎస్ఏ) ద్వారా ఆక్సిజన్ ను తయారు చేసే ప్లాంట్లను నిర్మించబోతోంది. దేశవ్యాప్తంగా అలాంటి 551 ప్లాంట్ల ఏర్పాటు కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.

పీఎం కేర్స్ నిధుల నుంచి తొలుత ఆయా ప్లాంట్లకు నిధులు అందజేస్తామని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. వీలైనంత త్వరగా ఆ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాని మోడీ ఆదేశించారని పేర్కొంది. ఆ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే జిల్లా స్థాయిలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుందని తెలిపింది. జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పింది. ఆక్సిజన్ సేకరణ కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పింది.  

ఈ ప్లాంట్లతో ఆక్సిజన్ కొరత తీరుతుందని స్పష్టం చేసింది. నిర్విరామంగా ఆక్సిజన్ ను అందించొచ్చని తెలిపింది. ఉత్పత్తయ్యే ఆక్సిజన్ తో రోజువారీ అవసరాలను తీర్చుకోవచ్చని చెప్పింది. వీటి ద్వారా నేరుగా పేషెంట్లకే ఆక్సిజన్ అందించొచ్చని తెలిపింది. దానితో పాటు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కూడా చేదోడుగా ఉంటుందని తెలిపింది.

More Telugu News