Tirumala: రూ. కోటి దిగువకు పడిపోయిన తిరుమల హుండీ ఆదాయం!

  • తిరుమల ప్రయాణానికి ఆసక్తి చూపని భక్తులు
  • రూ. 85 లక్షలకు తగ్గిన హుండీ ఆదాయం
  • నిన్న దాదాపు 24 వేల మందికి దర్శనం
Tirumala Hundi Offerings Down Amid Low Piligrims Rush

సాధారణ పరిస్థితుల్లో అయితే, తిరుమలో వసంతోత్సవాల సమయంలో భక్తులు కిటకిటలాడుతుంటారు. ఈ సంవత్సరం మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఓ వైపు తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు జరుగుతున్నా, భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. కరోనా భయంతో ప్రయాణాలు చేసేందుకు అత్యధికులు ఆసక్తిని చూపించడం లేదు. ఈ ప్రభావం తిరుమలపైనా పడింది.

నిన్న శనివారం నాడు స్వామివారిని 23,998 మంది దర్శించుకోగా, 13,061 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం కూడా భారీగా పడిపోయింది. చాలా కాలం తరువాత హుండీ ఆదాయం రూ. 85 లక్షలకు తగ్గింది. కరోనా సెకండ్ వేవ్ వల్లనే భక్తుల రద్దీ మందగించిందని, పరిస్థితులు చక్కబడేంత వరకూ టైమ్ స్లాట్ టోకెన్ దర్శనాల కోటాను విడుదల చేసే పరిస్థితి లేదని టీటీడీ అధికారులు వెల్లడించారు.

More Telugu News