రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై కామెంట్స్... తమిళ చిత్రానికి 100 కట్స్!

25-04-2021 Sun 08:43
  • జీవీ ప్రకాశ్ కుమార్, హీరోగా చిత్రం
  • తొలుత సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వని సభ్యులు
  • ఆపై పలు కట్స్ తో అనుమతి
Tamil Movie Gets 100 Cuts for Comments on Rajanikant

తమిళ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్, హీరోగా నటించిన చిత్రంపై సెన్సార్ సభ్యులు వేటు వేశారు. 'అడంగాదే' అనే పేరుతో ఈ చిత్రం నిర్మితం కాగా, ఇందులో రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై పలు సీన్లు, డైలాగులు ఉన్నాయి.

ముత్తుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్, నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని, సెన్సార్ కు వెళ్లగా, దీనిలో రజనీ రాజకీయ ప్రస్థానంపై పలు విమర్శలు ఉన్నాయని సభ్యులు గుర్తించి, క్లియరెన్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపించగా, మొత్తం 100 సన్నివేశాలను కట్ చేస్తూ, సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అంగీకరించింది.