Manmohan singh: కరోనా నుంచి కోలుకుంటున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

Manmohan Singh Recovering from Corona Virus
  • కరోనాతో ఈ నెల 19న ఎయిమ్స్‌లో చేరిక
  • ఆరోగ్యం స్థిరంగా ఉందన్న కాంగ్రెస్
  • దేశ ప్రజలకు రణ్‌దీప్ కృతజ్ఞతలు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కరోనా నుంచి కోలుకుంటున్నట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. కరోనా బారినపడిన మన్మోహన్ సింగ్ ఈ నెల 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా, మన్మోహన్ ఇప్పటికే కరోనా టీకా రెండు డోసులు వేయించుకున్నారు. గత నెల 4న తొలి విడత టీకా వేయించుకోగా, ఈ నెల 3న రెండో దఫా టీకా వేయించుకున్నారు.

మన్మోహన్ కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. ఈ మధ్య జ్వరం కూడా  రాలేదని పేర్కొన్నారు. మన్మోహన్ కోలుకోవాలని ప్రార్థించిన భారత ప్రజలందరికీ ఈ సందర్భంగా రణ్‌దీప్ కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News