Corona Virus: నెలసరి సమయంలో కరోనా టీకా తీసుకోవచ్చా?

Is it not safe to take corona vaccine during Menstruation
  • సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వదంతులు
  • నెలసరికి 5 రోజుల ముందు, 5 రోజుల తర్వాత టీకా తీసుకోవద్దని దుష్ప్రచారం
  • కొట్టిపారేసిన కేంద్ర ప్రభుత్వం
  • ప్రచారంలో వాస్తవం లేదంటున్న వైద్యులు
మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్న తరుణంలో ఓ వదంతు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మహిళలు నెలసరికి ఐదు రోజుల ముందు.. ఐదు రోజుల తర్వాత టీకా వేయించుకోవద్దనే వార్త సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య వైరల్‌గా మారింది. అయితే, ఇవన్నీ వట్టి పుకార్లేనని వీటిని నమ్మొద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని.. మహిళలు దీన్ని నమ్మొద్దని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ట్విట్టర్‌లో పేర్కొంది. ప్రభుత్వంతో పాటు పలువురు వైద్యులు, వైద్య నిపుణులు ఈ దుష్ప్రచారాన్ని కొట్టిపారేశారు.

18 ఏళ్లు పైబడిన వారందరూ మే 1 తర్వాత టీకా వేయించుకునేందుకు కేంద్రం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నెల 28 నుంచి కొవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవనున్నాయి. మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయినప్పటికీ.. టీకా పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది.  నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 29 లక్షల టీకా డోసుల పంపిణీ జరిగింది.
Corona Virus
COVID19
Menstruation
Covid-19
Corona vaccine

More Telugu News