బౌలింగ్ లో రాణించిన క్రిస్ మోరిస్... కోల్ కతా స్వల్ప స్కోరు

24-04-2021 Sat 21:43
  • ఐపీఎల్ లో కోల్ కతా వర్సెస్ రాజస్థాన్
  • ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి కోల్ కతాకు బ్యాటింగ్ అప్పగించిన రాజస్థాన్
  • 4 వికెట్లు తీసిన క్రిస్ మోరిస్
Chris Morris bags four wickets against KKR
రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ స్వల్ప స్కోరుతో సరిపెట్టుకుంది. 20 ఓవర్లు ఆడి 9 వికెట్లకు 133 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ పేసర్ క్రిస్ మోరిస్ 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. మోరిస్ ధాటికి దినేశ్ కార్తీక్ (25), ఆండ్రీ రస్సెల్ (9), కమ్మిన్స్ (10), శివం మావి (5) పెవిలియన్ చేరారు. కోల్ కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ లో రాహుల్ త్రిపాఠి సాధించిన 36 పరుగులే అత్యధికం. ఓపెనర్ నితీశ్ రాణా 22 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా, ముస్తాఫిజూర్ రెహ్మాన్ తలో వికెట్ తీశారు.