Load Charges: ఏపీలో విద్యుత్ పంపిణీ సంస్థల లోడ్ చార్జీలు పెంపు

Electricity load charges hike in AP
  • ఏపీ విద్యుత్ రంగంలో కీలక నిర్ణయం
  • సీపీడీసీఎల్ పరిధిలోని ప్రతి ఇంటికీ లోడ్ నోటీసులు
  • 2 కిలో వాట్ల అదనపు లోడ్ కు రూ.3 వేలు వడ్డన
  • వారం రోజుల్లో చెల్లించకుంటే కనెక్షన్ కట్!
రాష్ట్రంలో విద్యుత్ రంగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల లోడ్ చార్జీలు పెంచుతున్నట్టు సీపీడీసీఎల్ ప్రకటించింది. సీపీడీసీఎల్ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికీ అదనపు లోడ్ నోటీసులు పంపుతున్నట్టు పేర్కొంది. 2 కిలో వాట్ల అదనపు లోడ్ కు కనీసం రూ.3 వేలు చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. వారం లోగా చెల్లించకుంటే ఫ్యూజులు తొలగిస్తామని సీపీడీసీఎల్ సిబ్బంది స్పష్టం చేశారు. కాగా, విజయవాడ సర్కిల్ పరిధిలో ఇప్పటికే రూ.3 కోట్లకు పైగా అదనపు లోడ్ చార్జీలు వసూలు చేశారు.
Load Charges
Hike
Distribution Companies
APCPDCL
Andhra Pradesh

More Telugu News