New Delhi: ఆక్సిజన్‌ కోసం అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసిన అరవింద్‌ కేజ్రీవాల్‌!

  • ఢిల్లీలో తీవ్ర ఆక్సిజన్‌ కొరత
  • ఏరోజు నిల్వలు ఆరోజే పూర్తి
  • ఆక్సిజన్‌ కొరతతో రోగులు మరణిస్తున్న వైనం
  • ఏమాత్రం మిగులు ఉన్నా పంపాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి
  • కేంద్రం సాయం చేస్తున్నా.. సరిపోవడం లేదని వెల్లడి
Kejriwal Writes To All CMs Asking for Oxygen

ఢిల్లీలో కరోనా విజృంభణతో తలెత్తిన ఆక్సిజన్‌ కొరత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. చాలా ఆసుపత్రులలో ఆక్సిజన్‌ నిల్వలు ఎప్పటికప్పుడు నిండుకుంటున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక ఆసుపత్రి ఆక్సిజన్‌ కోసం ప్రభుత్వానికి అత్యవసర సందేశం పంపాల్సిన పరిస్థితి తలెత్తింది. జైపూర్‌ గోల్డెన్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరతతో 25 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి వర్గాలే ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేస్తున్నప్పటికీ.. అవి ఏమాత్రం సరిపోవడం లేదు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఏమాత్రం ఆక్సిజన్‌ మిగులు నిల్వలున్నా ఢిల్లీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తున్నప్పటికీ.. వనరులు ఏమాత్రం సరిపోవడం లేదని తెలిపారు. ఢిల్లీలో ప్రస్తుతం రోజుకి 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం దేశ రాజధానిలో అత్యధికంగా 24,331 కేసులు రికార్డయ్యాయి. 348 మంది మరణించారు.

More Telugu News