Rajasthan Royals: నైట్ రైడర్స్ తో పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

Rajasthan Royals won the toss against Kolkata Knight Riders
  • ఐపీఎల్ లో నేడు కోల్ కతా వర్సెస్ రాజస్థాన్
  • బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
  • పాయింట్ల పట్టికలో చివరన ఉన్న రెండు జట్లు
  • ఆసక్తికరంగా నేటి మ్యాచ్!

ఐపీఎల్ 14వ సీజన్ క్రమంగా ఊపందుకుంటోంది. నేడు కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ లక్ష్యఛేదనకు మొగ్గు చూపింది. రాయల్స్ సారథి సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇవాళ్టి పోరులో తలపడుతున్న కోల్ కతా, రాజస్థాన్ జట్లు పాయింట్ల పట్టికలో అట్టడగున ఉన్నాయి. టోర్నీలో ఇరు జట్లు నాలుగేసి మ్యాచ్ లు ఆడి మూడింట ఓటమిపాలయ్యాయి. దాంతో ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో ముందంజ వేయాలని కసిగా ఉన్నాయి.

ఇక, ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ రాయల్స్ రెండు మార్పులు చేసింది. శ్రేయాస్ గోపాల్ స్థానంలో జయదేవ్ ఉనద్కట్, మనన్న వోరా స్థానంలో జైశ్వాల్ జట్టులోకి వచ్చారు. అటు, కోల్ కతా జట్టులో ఒక మార్పు జరిగింది. కమలేశ్ నాగర్ కోటి స్థానంలో శివం మావి తుదిజట్టుకు ఎంపికయ్యాడు. కాగా నేటి మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా నిలుస్తోంది.

  • Loading...

More Telugu News