ఆది - అవికా జోడీగా 'అమరన్' షూటింగ్ ప్రారంభం

24-04-2021 Sat 18:58
  • సాయికుమార్ క్లాప్ తో మొదలైన ఆది మూవీ
  • వీరభద్రం చౌదరితో రెండో సినిమా
  • కథానాయికగా అవికా గోర్
AadiSaikumar Amaran Shooting Started

చూస్తుండగానే ఆది సాయికుమార్ తన కెరియర్ ను మొదలెట్టేసి పదేళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. అపజయాలు ఎదురైనా తనపై తనకి గల నమ్మకంతో ముందుకు దూసుకుపోతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రం ఈ రోజున పూజా కార్యక్రమాలను జరుపుకుంది. 'అమరన్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకి వీరభద్రం చౌదరి దర్శకత్వం వహించనున్నాడు.

సాయికుమార్ క్లాప్ తో .. ఆదిసాయికుమార్ - అవికా గోర్ పై ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. గతంలో ఆది సాయికుమార్ హీరోగా వీరభద్రం చౌదరి 'చుట్టాలబ్బాయి' సినిమా చేశాడు. ఆ సినిమా ఫరవాలేదనిపించుకుంది. కొంత గ్యాప్ తరువాత అవికా గోర్ వరుసగా తెలుగు సినిమాలు ఒప్పుకుంటోంది. ఇప్పటికే చైతూ జోడీగా 'థాంక్యూ' చేస్తున్న ఆమె, ఆ తరువాత కల్యాణ్ దేవ్ తాజా చిత్రంలో కథానాయికగా కూడా ఎంపిక అయింది. తాజాగా ఈ సినిమాలోను ఛాన్స్ కొట్టేసిందన్న మాట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.