Bandi Sanjay: తల, చేతులు, కాళ్లు నరికే వాళ్లకు టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చింది: బండి సంజయ్

TRS given tickets to goondas and rowdies says Bandi Sanjay
  • రౌడీలు, గూండాలకు టీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చింది
  • సమాజ శ్రేయస్సు కోసం పని చేసేది బీజేపీ మాత్రమే
  • కులాలకు అతీతంగా ఓటు వేసి బీజేపీని గెలిపించండి
టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ రౌడీలు, గూండాలకు టికెట్లను ఇచ్చిందని అన్నారు. తల, కాళ్లు, చేతులు నరికేవాళ్లకు టికెట్లను ఇచ్చిందని చెప్పారు. తలలు నరికే పార్టీ కావాలో, వరంగల్లును అభివృద్ధి చేసే పార్టీ కావాలో ఓటు వేసేటప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం పని చేసేది బీజేపీ మాత్రమేనని చెప్పారు. వరంగల్ ప్రజలు కులాలకు అతీతంగా కమలం గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Bandi Sanjay
BJP
Warangal Elections
TRS

More Telugu News