Ben Stokes: చెన్నై పిచ్ లు పరమ చెత్తగా ఉన్నాయి: బెన్ స్టోక్స్

  • పిచ్ కారణంగా ఐపీఎల్ జట్లు తక్కువ స్కోర్లకే పరిమితమవుతున్నాయి
  • 170 పరుగులు నమోదు కావాల్సిన మ్యాచులు 
  • కేవలం 140 రన్స్ మాత్రమే నమోదవుతున్నాయి
  • ఐపీఎల్ కీలక దశకు చేరుకున్న తరుణంలో టోర్నమెంటు దారుణంగా మారకూడదు
Chennai pitch is very worst says Ben Stokes

చెన్నైలోని చిదంబరం క్రికెట్ స్టేడియంలోని పిచ్ లపై ఇంగ్లండ్ ఆల్ రౌండర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు బెన్ స్టోక్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. చెన్నై పిచ్ లు పరమ చెత్తగా ఉన్నాయని విమర్శించాడు. ఐపీఎల్ ఆడుతున్న జట్లు పిచ్ కారణంగా తక్కువ స్కోర్లకే పరిమితం కావడం దురదృష్టకరమని అన్నాడు. ఐపీఎల్ కీలక దశకు చేరుకున్న తరుణంలో టోర్నమెంటు దారుణంగా మారకూడదని చెప్పాడు.

160 నుంచి 170 పరుగులు నమోదు కావాల్సిన మ్యాచుల్లో కూడా కేవలం 130 నుంచి 140 రన్స్ మాత్రమే నమోదవుతున్నాయని స్టోక్స్ తెలిపాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 131 పరుగులకే పరిమితమైన నేపథ్యంలో స్టోక్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పటి వరకు చెన్నైలో జరిగిన మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు కేవలం రెండు సార్లు మాత్రమే 170కి మించి పరుగులు చేశాయని స్టోక్స్ చెప్పాడు. ఒకసారి కోల్ కతా నైట్ రైడర్స్ పై ఆర్సీబీ 204 పరుగులు చేయగా, మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ పై కేకేఆర్ 187 పరుగులు చేసింది. మరోవైపు, చేతి వేలికి గాయం అయిన కారణంగా ఐపీఎల్ నుంచి స్టోక్స్ అర్ధాంతరంగా వైదొలగిన సంగతి తెలిసిందే.

More Telugu News