KCR: తెలంగాణలోని అందరికీ వ్యాక్సిన్ ఫ్రీ: కేసీఆర్ ఆదేశాలు

Telanga govt to give free Corona vaccine to all
  • రాష్ట్రంలోని 4 కోట్ల మందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్
  • ప్రభుత్వంపై రూ. 2,500 కోట్ల భారం
  • వ్యాక్సినేషన్ ను స్వయంగా పర్యవేక్షించనున్న కేసీఆర్
కరోనా వ్యాక్సినేషన్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ను పూర్తిగా ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు ఉన్నవారికి ఉచిత వ్యాక్సిన్ ఇస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు  ముందుకు వేసి, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఉచిత వ్యాక్సిన్ నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వంపై రూ. 2,500 కోట్ల భారం పడనుంది.

ఉచిత వ్యాక్సిన్ కు సంబంధించి సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులకు కేసీఆర్ ఆదేశాలు  జారీ చేశారు. మరో రెండు రోజుల్లో సీఎం అత్యున్నత స్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షంచనున్నారు. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
KCR
TRS
Telangana
Corona Vaccine
Free

More Telugu News