Jagan: ప్రపంచమంతా కరోనాపై పోరాటం చేస్తుంటే.. జగన్ రెడ్డి రాజకీయపోరులో బిజీగా ఉన్నారు: అచ్చెన్నాయుడు

Jagan is neglecting Corona says Atchannaidu
  • కరోనా పట్ల జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
  • జగన్ తీరుతో కరోనా కేసులు 10 లక్షలు దాటాయి
  • ప్రజల ప్రాణాలంటే లెక్కలేని విధంగా వ్యవహరిస్తున్నారు
కరోనా కట్టడి విషయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు 10 లక్షలను దాటాయని విమర్శించారు. ఓవైపు కేసులు భారీగా విస్తరిస్తుంటే... మరోవైపు జగన్ తూతూ మంత్రంగా సమీక్షలను నిర్వహిస్తూ, చేతులు దులుపుకుంటున్నారని అన్నారు.

ప్రపంచమంతా కరోనాపై పోరాటంలో బిజీగా ఉందని... జగన్ మాత్రం రాజకీయ పోరులో బిజీగా ఉన్నారని అచ్చెన్న దుయ్యబట్టారు. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకకపోవడంతో కరోనా పేషెంట్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కోవిడ్ ఆసుపత్రులను ప్రభుత్వం పెంచడం లేదని, క్వారంటైన్ కేంద్రాలను పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలని, కరోనా కట్టడిపై దృష్టిని సారించాలని హితవు పలికారు.
Jagan
YSRCP
Atchannaidu
Telugudesam
Corona Virus

More Telugu News