USA: హాని కంటే ప్రయోజనాలే ఎక్కువ.. జాన్సన్​ అండ్​ జాన్సన్​​ టీకాపై అమెరికా

US Lifts Pause on Johnson and Johnson Corona Vaccine
  • వ్యాక్సిన్ వినియోగంపై విధించిన నిషేధం ఎత్తివేత
  • రక్తం గడ్డ కట్టే సందర్భాలు చాలా తక్కువని వెల్లడి
  • నిర్భయంగా టీకాను వాడొచ్చని సీడీసీ, ఎఫ్ డీఏ సూచన
జాన్సన్ అండ్ జాన్సన్ ఒకే డోసు కరోనా టీకా వినియోగానికి అమెరికా లైన్ క్లియర్ చేసింది. ఆ టీకాతో రక్తం గడ్డ కడుతోందన్న ఆరోపణల నడుమ ఇటీవల వ్యాక్సిన్ వినియోగంపై ఆ దేశం తాత్కాలిక నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆ తాత్కాలిక నిషేధాన్ని అమెరికా ఎత్తేసింది. వ్యాక్సిన్ తో హాని కన్నా ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.

వ్యాక్సిన్ భద్రతా ప్రమాణాలపై వ్యాధుల నియంత్రణ నివారణ కేంద్రం (సీడీసీ), ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్ డీఏ)లు లోతైన విశ్లేషణ చేసి.. శుక్రవారం ఈ నిర్ధారణకు వచ్చాయి. వ్యాక్సిన్ తో రక్తం గడ్డ కట్టిన సందర్భాలు చాలా తక్కువేనని, కాబట్టి వ్యాక్సిన్ ను నిర్భయంగా వినియోగించవచ్చని అధికారులు పేర్కొన్నారు. నిషేధం ఎత్తివేతతో అన్ని రాష్ట్రాలూ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ను ప్రజలకు ఇవ్వొచ్చని సీడీసీ అధికారులు చెప్పారు. ఇక, పేషెంట్, హెల్త్ కేర్ ప్రొవైడర్లకు సంబంధించి నిజనిర్ధారణ పత్రాన్ని అప్ డేట్ చేసింది.
USA
Johnson and Johnson
COVID19
Corona Virus
Corona Vaccine

More Telugu News