Parital Sriram: అన్నప్రాసనలో కత్తిని పట్టుకున్న పరిటాల శ్రీరామ్ కుమారుడు!

  • బంధుమిత్రులు, కార్యకర్తల సమక్షంలో అన్నప్రాసన కార్యక్రమం
  • ఎన్నో వస్తువులు ఉన్నా కత్తిని పట్టుకున్న చిన్నారి రవీంద్ర
  • కాసేపు తల పట్టుకున్న శ్రీరామ్
Paritala Sriram son takes knife in annaprasana

టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కుమారుడు రవీంద్రకు నిన్న అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులతో పాటు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

చిన్నారి రవీంద్ర ముందు పుస్తకాలు, డబ్బులు, ఇతర వస్తువులతో పాటు ఓ కత్తిని కూడా ఉంచారు. అయితే, అన్ని వస్తువులను వదిలేసిన రవీంద్ర కత్తిని పట్టుకున్నాడు. దీంతో, పరిటాల శ్రీరామ్ కాసేపు తల పట్టుకున్నారు. ఆ సన్నివేశాన్ని చూసి అందరూ నవ్వుకున్నారు. శ్రీరామ్ తన కుమారుడికి తన తండ్రి పేరునే పెట్టుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News