SI: కిడ్నాప్ గు గురైన ఎస్సై మురళిని చంపేసిన మావోయిస్టులు

  • విడిపించేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తుండగానే ఘాతుకం
  • ప్రజాకోర్టు పెట్టి మురళిపై పలు అరోపణలు
  • పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో లేఖ
Maoists Killed SI Murali

తమ చెరలో ఉన్న ఎస్సైని మావోయిస్టులు హత్య చేసి రోడ్డుపై పడేశారు. ఈ నెల 21న చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలనార్ గ్రామంలో ఎస్సై తాటి మురళిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. మూడు రోజులపాటు తమ చెరలో ఉంచుకున్న మావోలు తాాజాగా మురళిని హత్యచేసి పుల్సుమ్ పారా వద్ద  రోడ్డుపై పడేశారు.

ఈ సందర్భంగా పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో ఓ లేఖను మావోలు వదిలివెళ్లారు. ఈ నెల మొదటి వారంలో పోలీసులకు, మావోలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మురళి ప్రమేయం ఎక్కువగా ఉందని ఆరోపిస్తూ కిడ్నాప్ చేశారు.

చత్తీస్‌గఢ్‌లోని పలు గ్రామాల్లో అమాయక ఆదివాసీ గిరిజనులను హత్య చేయడంతోపాటు మహిళలపై అత్యాచారానికి తెగబడ్డాడని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో  ప్రజా కోర్టు పెట్టి చంపేశామని పేర్కొన్నారు. కాగా, మురళిని విడిపించేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్న సమయంలోనే మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడడం గమనార్హం.

More Telugu News