SapceX: ‘స్పేస్ఎక్స్’ మరో విజయం.. పునర్వినియోగ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములు

  • తొలిసారి పునర్వినియోగ రాకెట్‌తో ప్రయోగం
  • ఐఎస్ఎస్‌కు అమెరికా, జపాన్, ఫ్రాన్స్ దేశాల వ్యోమగాములు
  • ఆరు నెలలపాటు అక్కడే ప్రయోగాలు
SpaceX launches third crew with recycled rocket and capsule

అమెరికాకు చెందిన అంతరిక్ష సేవల ప్రైవేటు సంస్థ స్పేస్ఎక్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మళ్లీమళ్లీ ఉపయోగించగలిగే సామర్థ్యం ఉన్న రాకెట్, క్యాప్సూల్‌ ద్వారా  నిన్న నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది. ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది.

 అంతరిక్షానికి వెళ్లిన వారిలో అమెరికా, జపాన్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వ్యోమగాములు ఉన్నారు. మరికాసేపట్లో వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు చేరుకుంటారు. ఆరు నెలలపాటు వారు అక్కడే ఉండనున్నారు. కాగా, ఈ ప్రయోగం కోసం పునర్వినియోగ క్యాప్సూల్, రాకెట్‌ను స్సేస్ఎక్స్ ఉపయోగించడం ఇదే తొలిసారి.

More Telugu News