Corona Virus: కరోనా వైరస్‌ చికిత్స కోసం.. మరో ఔషధానికి డీసీజీఐ అనుమతి

  • ఇప్పటికే రెమ్‌డెసివిర్‌ వినియోగం
  • తాజాగా విరాఫిన్‌కు అనుమతి
  • విరాఫిన్‌ను రూపొందించిన జైడస్‌ క్యాడిలా
  • క్లినికల్‌ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు
  • త్వరగా కోలుకునే ఆస్కారం
Virafin to be used in corona treatment

కరోనా వైరస్‌ చికిత్సలో ప్రస్తుతం రెమ్‌డెసివిర్‌ అనే యాంటీవైరల్‌ డ్రగ్‌ను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఔషధ సంస్థ జైడస్‌ క్యాడిలా రూపొందించిన ‘విరాఫిన్‌’ అనే మరో ఔషధాన్ని కూడా కరోనా చికిత్సలో వాడేందుకు డీసీజీఐ అనుమతించింది. మోతాదు లక్షణాలున్న కరోనా బాధితులకు ఈ ఔషధాన్ని ఇవ్వడం చికిత్స సులభమవుతోందని తెలిపింది. బాధితులు త్వరగా కోలుకోవడంతో పాటు చాలా వరకు లక్షణాలు ముదరకుండా ఈ ఔషధం నిలువరిస్తోందని జైడస్‌ తెలిపింది.

ప్రారంభంలోనే ఈ ఔషధాన్ని ఇవ్వడం వల్ల వైరల్‌ లోడ్‌ను భారీగా తగ్గించే అవకాశం ఉందని సంస్థ ఎండీ శార్విల్‌ పటేల్‌ తెలిపారు. ‘పెగిలేటెడ్‌ ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా 2బీ(PegIFN)’ శాస్త్రీయ నామం గల విరాఫిన్‌పై జైడస్‌ క్యాడిలా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఔషధం తీసుకున్న 91.15 శాతం మందిలో ఏడు రోజుల్లో వైరస్‌ పూర్తిగా తగ్గిపోయి నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు.

More Telugu News