మహిళల కంటే పురుషులకే ఎక్కువగా సోకుతున్న కరోనా!

23-04-2021 Fri 18:01
  • అమెరికాలోని రెండు రాష్ట్రాల్లో అధ్యయనం
  • తెల్లజాతి పురుషులకంటే నల్లజాతివారే ఎక్కువగా చనిపోతున్నట్టు వెల్లడి
  • జర్నల్ ఆఫ్ జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ లో వివరాలు ప్రచురితం
Corona affecting men more than women
ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల్లో మహిళల కంటే పురుషులే అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ విషయం జర్నల్ ఆఫ్ జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ లో ప్రచురితమైంది. అమెరికాలోని రెండు రాష్ట్రాల్లో పురుషులు, మహిళలపై అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది.

అయితే ఆసియా అమెరికన్ పురుషుల కంటే నల్లజాతి మహిళలు కరోనాతో చనిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. కరోనా వల్ల నల్లజాతి మహిళలు మూడు రెట్లు ఎక్కువగా మరణిస్తున్నట్టు తేలింది. మరోవైపు తెల్లజాతి వారికంటే నల్లజాతి పురుషులే ఎక్కువగా మరణిస్తున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది.