18 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితం: సీఎం జగన్

23-04-2021 Fri 17:56
  • అత్యంత తీవ్రస్థాయిలో కరోనా వ్యాప్తి
  • మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్
  • ప్రస్తుతం 45 ఏళ్లకు పైబడిన వారికి టీకా డోసులు
  • 2 కోట్ల 4 లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తామన్న సీఎం జగన్
CM Jagan announced free vaccination in AP
మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని కేంద్రం ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా వేస్తామని వెల్లడించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45 ఏళ్లకు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా... 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్ ను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్టు సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలోని 2 కోట్ల 4 లక్షల మందికి ఉచితంగా టీకా డోసులు అందిస్తామని వివరించారు. ఈ ఉచిత టీకాల కార్యక్రమాన్ని మే 1 నుంచి అమలు చేస్తామని చెప్పారు.

కరోనా వ్యాక్సిన్ డోసులు మరిన్ని అందించాలని ఏపీ సీఎం జగన్ కొవాగ్జిన్ తయారీదారు భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లాతో మాట్లాడడం తెలిసిందే. సీఎం విజ్ఞప్తికి భారత్ బయోటెక్ అధినేత సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.