ఏపీలో రేపటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ

23-04-2021 Fri 17:44
  • ఏపీపై కరోనా పడగ
  • వైరస్ కట్టడికి సర్కారు కఠిన చర్యలు
  • రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
  • కర్ఫ్యూ సమయంలో కఠిన నిబంధనలు
  • మంత్రి ఆళ్ల నాని వెల్లడి
Night curfew in AP from tomorrow
కరోనా పంజా ధాటికి అతలాకుతలం అవుతున్న ఏపీ వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు ఏపీ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వివరించారు. రాత్రి కర్ఫ్యూ సందర్భంగా కఠిన నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరింతగా కరోనా వ్యాప్తి చెందకుండా వ్యాక్సినేషన్ ను ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించగా, తెలంగాణ వంటి మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించడం తెలిసిందే.