రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచుతున్నాం: మంత్రి ఆళ్ల నాని

23-04-2021 Fri 17:32
  • వీఆర్ డీఎల్ ల్యాబ్ ల ద్వారా కరోనా పరీక్షలు
  • మెడికల్ కాలేజీల్లోనూ ఆర్టీపీసీఆర్ టెస్టులు
  • 533 మంది సిబ్బంది నియామకం
  • ఇకపై రోజుకు 60 వేల కరోనా టెస్టులు
Alla Nani says will increase corona tests in state
ఏపీలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని నిర్ణయించుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. వీఆర్ డీఎల్ ల్యాబ్ ల ద్వారా కరోనా పరీక్షలకు అనుమతించినట్టు వివరించారు. కరోనా పరీక్షల కోసం వైద్య కళాశాలల్లో 533 మందిని నియమించినట్టు తెలిపారు. మరో 110 మంది టెక్నికల్ సిబ్బంది సాయం కూడా తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఇకపై రోజుకు 60 వేల కరోనా పరీక్షలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆళ్ల నాని వెల్లడించారు. ట్రూనాట్ యంత్రాల ద్వారా గతంలో రోజుకు 10 వేల పరీక్షలు చేశామని, మూడ్రోజుల్లో ట్రూనాట్ పరీక్షల నిర్వహణకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.