తిరుమలలో ఈదురుగాలులతో భారీ వర్షం

23-04-2021 Fri 16:46
  • తడిసి ముద్దయిన తిరుమల గిరులు
  • ఒక్కసారిగా మారిన వాతావరణం
  • ఉరుములు, మెరుపులతో వర్షం
  • గాలులకు విరిగిపడిన చెట్ల కొమ్మలు
  • తిరుమాడ వీధులు జలమయం
Huge rainfall in Tirumala
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. కాగా, తిరుమలలో ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దాదాపు గంటన్నర పాటు వర్షం పడడంతో తిరుమాడ వీధులు జలమయం అయ్యాయి. ఈదురు గాలులకు చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. స్వామివారి ప్రధాన ఆలయం చుట్టూ నీరు భారీగా నిలిచింది. అటు, విశాఖపట్నంలోనూ వర్షం కురిసింది. రోడ్లు జలమయం అయ్యాయి.