Shanaya Katwe: ప్రియుడి మోజులో సొంత తమ్ముడ్నే అంతమొందించిన కన్నడ హీరోయిన్!

Police arrests kannada heroine Shanaya Katwe in her brother murder case
  • హత్య కేసులో షనాయా కాట్వే అరెస్ట్
  • కొంతకాలంగా మేనేజర్ తో ప్రేమ వ్యవహారం
  • అభ్యంతరం చెప్పిన సోదరుడు
  • ప్రియుడితో కలిసి ప్లాన్
  • షనాయా సోదరుడ్ని చంపేసిన మేనేజర్
కన్నడ సినీ హీరోయిన్ షనాయా కాట్వే హత్య కేసులో ఇరుక్కుంది. అది కూడా సొంత తమ్ముడ్నే చంపించింది. దీనికంతటికీ కారణం ప్రేమ వ్యవహారం. షనాయా కాట్వే గత కొంతకాలంగా సినీ తారల మేనేజర్ నియాజ్ అహ్మద్ తో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. అయితే షనాయా లవ్ అఫైర్ ను ఆమె సోదరుడు రాకేశ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. నియాజ్ అహ్మద్ కు దూరంగా ఉండాలని చెప్పాడు.

అప్పటికే ప్రియుడి మోజులో నిండా మునిగిపోయిన షనాయాకు తమ్ముడి మాటలు రుచించలేదు. ఈ విషయాన్ని తన ప్రియుడు నియాజ్ కు చెప్పింది. తమ ప్రేమకు రాకేశ్ మున్ముందు అడ్డు తగులుతాడని భావించి అతడ్ని హత్య చేయడానికి పథక రచన చేశారు. ఒకరోజు నియాజ్, అతడి గ్యాంగ్... రాకేశ్ ను అంతమొందించి అతడి మృతదేహాన్ని కారులో దాచారు. అయితే ఆ మృతదేహం కుళ్లి వాసన వస్తే దొరికిపోతామని భావించి, రాకేశ్ మృతదేహాన్ని ఖండఖండాలుగా నరికి హుబ్బళ్లి పరిసర ప్రాంతాల్లో విసిరేశారు.

ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడింది నియాజ్ అని గుర్తించారు. ఈ హత్య వెనుక రాకేశ్ సోదరి షనాయా కాట్వే ఉందని తెలుసుకుని ఆమెను కూడా అరెస్ట్ చేశారు. షనాయా కన్నడ చిత్ర పరిశ్రమలో ఓ మోస్తరు హీరోయిన్ గా కొనసాగుతోంది. ఒందు గంటేయ కథ, ఇదం ప్రేమమ్ జీవనమ్ వంటి చిత్రాల్లో నటించింది.
Shanaya Katwe
Murder
Brother
Rakesh
Niyaz
Love
Karnataka

More Telugu News