ఇప్పుడు విహార‌యాత్రలా?: సెలబ్రిటీలపై శ్రుతిహాసన్ మండిపాటు

23-04-2021 Fri 12:03
  • ఇది చాలా క్లిష్ట‌పరిస్థితుల‌ను ఎదుర్కొంటోన్న స‌మ‌యం
  • కొంద‌రు విహార‌యాత్ర‌ల‌కు వెళ్ల‌డం స‌రికాదు
  • సెలెబ్రిటీల‌ను అభిమానించే ఫ్యాన్స్ క‌ష్టాలో ఉన్నారు
shruti hassan on celebrities tour

ఓ వైపు క‌రోనా ఉద్ధృతి ఉగ్ర‌రూపం దాల్చితే, మ‌రోవైపు కొంద‌రు సెలెబ్రిటీలు మాత్రం త‌మ‌కు ఏమీ ప‌ట్ట‌న‌ట్లు విహార యాత్ర‌ల‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుండ‌డం ప‌ట్ల హీరోయిన్ శ్రుతిహాస‌న్ మండిపడింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... క‌రోనా ఉద్ధృతి అధికంగా ఉంద‌ని, ఇది చాలా క్లిష్ట‌పరిస్థితుల‌ను ఎదుర్కొంటోన్న స‌మ‌య‌మ‌ని చెప్పింది.

ఇలాంటి స‌మ‌యంలో కొంద‌రు విహార‌యాత్ర‌ల‌కు వెళ్ల‌డం స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డింది. సెలెబ్రిటీల‌ను అభిమానించే ఫ్యాన్స్ క‌ష్టాలో ఉన్న‌ప్పుడు పార్టీలు చేసుకోవ‌డం, టూర్‌కు వెళ్లి ఎంజాయ్ చేయ‌డం మంచి ప‌ద్ధ‌తి కాదని చెప్పింది. త‌న‌ వంతుగా ప్రజలకు ఉపయోగపడే ఎటువంటి సమాచారాన్న‌యినా షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. కాగా, ఇటీవ‌ల సినీన‌టులు రణ్‌బీర్, అలియా, జాన్వి, సారా, దిశా పటానీతో పాటు ప‌లువురు టూర్ల‌కు వెళ్లి ఎంజాయ్ చేసి ఫొటోల‌ను పోస్ట్ చేశారు. వారిపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురుస్తోంది.