15 రోజుల పాటు నన్ను ఎవరూ కలవొద్దు: ఈటల రాజేందర్

23-04-2021 Fri 11:52
  • కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈటల కీలక నిర్ణయం
  • అత్యవసరమైతే తప్ప ఎవరూ ఫోన్ కూడా చేయవద్దని విన్నపం
  • కేటీఆర్ కు కూడా సోకిన కరోనా
Etela Rajender asks everyone not to meet him says Etela Rajenderr

కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 15 రోజులపాటు తనను ఎవరూ కలవొద్దని పార్టీ శ్రేణులకు ఆయన విన్నవించారు. అత్యవసరం ఉంటే తప్ప తనకు ఫోన్ కూడా చేయవద్దని కోరారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ కు కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. కోవిడ్ కు సంబంధించిన స్వల్ప లక్షణాలు తనలో ఉన్నాయని చెప్పారు. హోం క్వారంటైన్ లో ఉంటూ ఆయన చికిత్స పొందుతున్నారు.