'ఆచార్య' సెట్ కోసం అందుకే అన్ని కోట్లు ఖర్చు పెట్టారట!

23-04-2021 Fri 10:39
  • భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'ఆచార్య'
  • అవినీతిని తరిమివేయడమే ఆచార్యుడి లక్ష్యం
  • 20 ఎకరాల్లో 20 కోట్లతో వేసిన సెట్  
Huge sets for Acharya movie

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, చరణ్ - పూజ హెగ్డే ప్రత్యేకమైన పాత్రల్లో అలరించనున్నారు. ఈ సినిమా కోసం 20 కోట్ల రూపాయల ఖర్చుతో 20 ఎకరాల్లో ఒక భారీ సెట్ వేశారు.

'ధర్మస్థలి' పేరుతో ఒక ఆలయం .. దాని పరిసరాలకు సంబంధించిన సెట్ ఇది. అయితే ఇది ఒక ఫైట్ కోసమో .. పాట కోసమో  వేసిన సెట్ కాదట. సినిమాకి సంబంధించిన 60 శాతం షూటింగు ఈ సెట్ పరిధిలోనే జరుగుతుందని చెబుతున్నారు. సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాల ఆవిష్కారం ఈ సెట్ లోనే జరుగుతుందని అంటున్నారు.

ఈ సెట్ లో చిరంజీవి - చరణ్  కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ సినిమాకి ఈ సెట్ ప్రత్యేకమైన ఆకర్షణ అని అంటున్నారు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపుదశకి చేరుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగును వాయిదా వేశారు. త్వరలోనే తిరిగి సెట్స్ పైకి వెళ్లనున్నారు. అవినీతిపరులను ఉపదేశాలతో మార్చలేమని భావించి, ఉద్యమ మార్గాన్ని ఎంచుకునే ఓ ఆచార్యుడి కథ ఇది. ఈ సినిమా కోసమే మెగా అభిమానులంతా వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు.