'ఇప్పుడిలాంటి పిక్స్ అవసరమా?' అన్న నెటిజన్ ప్రశ్నకు యాంకర్ అనసూయ సమాధానం ఇది!

23-04-2021 Fri 09:52
  • పొట్టి దుస్తులతో ఫొటోలు పెట్టిన అనసూయ
  • ప్రశ్నించగా, ప్రజలకు వినోదం కోసమని వెల్లడి
  • చేయూత కావాలే తప్ప వినోదానికి సమయం కాదని సెటైర్లు
Trolling Over Anchor Anasuya Hot Pics

సోషల్ మీడియాలో యాంకర్ అనసూయ భరద్వాజ్ ఎంత హంగామా చేస్తుంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు తన గురించిన సమాచారాన్ని పంచుకుంటూ, తనపై వచ్చే కామెంట్లకు పంచ్ లతో సమాధానం ఇస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు, చిన్నపిల్లలా మారిపోయి, పొట్టి దుస్తులు, రెండు జడలు వేసుకుని తీసుకున్న తాజా ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది. ఇక ఇవి వైరల్ కాగా, పలువురు వీటిని చూసి మండిపడుతూ కామెంట్లు చేశారు.

ఓ నెటిజన్, స్కూలు బ్యాగు వేసుకోవడం మరచిపోయినట్టున్నావని సెటైర్ వేయగా, మరో వ్యక్తి, కరోనా కేసులు పెరుగుతూ, ఎంతో మంది చనిపోతుంటే, ఇటువంటి ఫొటోలు ఎలా పెట్టాలనిపిస్తోందని ప్రశ్నించాడు. ఇక వీటిపై ఘాటుగా స్పందించిన అనసూయ, పరిస్థితులు విషమమైన వేళ, ప్రజలకు కొంత వినోదాన్ని కలిగించడానికి తాను ప్రయత్నించానని బదులిచ్చింది.

ఇక ఈ సమాధానాన్ని చూసిన వారిలో కొందరు సమర్థించగా, మరికొందరు విభేదించారు. ఈ సమయంలో వినోదం అవసరం లేదని, చేయూత కావాలని, చనిపోయేవారిని ఎంటర్ టెయిన్ చేస్తున్నానంటూ, నీ చర్యలను ఎందుకు సమర్థించుకుంటున్నావని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

సదరు నెటిజన్ పోస్టు, అనసూయ అభిమానులకు ఒకింత ఆగ్రహాన్ని తెప్పించింది. పరిస్థితులు అంత దారుణంగా ఉంటే, ఇన్ స్టాగ్రామ్ ఎందుకు చూస్తున్నావని, ఎవరు ఏ పోస్ట్ పెట్టారో నీకెందుకని ప్రశ్నిస్తూ, నిలదీస్తున్నారు.