Hyderabad: గచ్చిబౌలి టిమ్స్‌ ఆసుపత్రిలో కరోనాతో ఒక్కరోజే 20 మంది మృత్యువాత

20 covid patients died in Gachibowli TIMS on Thursday alone
  • ‘టిమ్స్’లో గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి
  • రెండు రోజుల్లో 38 మంది మృతి
  • పటాన్‌చెరులో మరో ఐదుగురి మృత్యువాత
తెలంగాణలో చెలరేగిపోతున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేసుల సంఖ్య కూడా దారుణంగా పెరిగిపోతోంది. ఇక, హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు పెద్ద ఎత్తున మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే 38 మృత్యువాత పడ్డారు.

 బుధవారం 18 మంది రోగులు మృతి చెందగా, నిన్న 20 మంది మరణించినట్టు టిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇషాన్ అహ్మద్ తెలిపారు. అయితే, ఇలా మరణిస్తున్న వారిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా, గత ఐదు రోజులుగా టిమ్స్‌లో ఇదే పరిస్థితి ఉన్నట్టు చెబుతున్నారు. రోజూ పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలుస్తోంది. నిన్న పటాన్‌చెరులోని ఓ ఆసుపత్రిలో ఐదుగురు కరోనా రోగులు మరణించారు.
Hyderabad
Corona Virus
TIMS
Gachibowli

More Telugu News