Tamil Nadu: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, మాస్క్ ధరించకున్నా జరిమానా: తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు

  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే రూ. 500
  • మాస్క్ ధరించకుంటే రూ. 200 జరిమానా
  • ఆదేశాలు తక్షణం అమల్లోకి
fine for spitting in Tamilnadu

రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున వెలుగు చూస్తుండడంతో తమిళనాడు ప్రభుత్వం మరిన్ని ఆంక్షలను తెరపైకి తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే రూ. 500, మాస్కులు ధరించకుంటే రూ. 200  చొప్పున జరిమానా విధించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పబ్లిక్ సెక్టార్ ప్రిన్సిపల్ సెక్రటరీ సెంథిల్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే, సచివాలయానికి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, సందర్శకులు కూడా తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని, లేకుంటే జరిమానా తప్పదని హెచ్చరించారు. సచివాలయ పరిసరాల్లో ఉమ్మినా జరిమానా తప్పదని, ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని సెంథిల్ కుమార్ తెలిపారు.

More Telugu News