సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

23-04-2021 Fri 07:24
  • ఫాలోవర్స్ కి థ్యాంక్స్ చెబుతున్న పూజ 
  • పవన్ కల్యాణ్ తో ప్రముఖ నిర్మాత ప్రాజక్ట్ 
  • ఇటలీలో షూటింగ్ చేస్తున్న నాగ చైతన్య  
Pooja Hegde achieved Thirteen million followers on Instagram
*  కథానాయిక పూజ హెగ్డే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఇన్ స్టాగ్రామ్ లో ఈ చిన్నది తాజాగా 13 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఫాలోవర్స్ కి థ్యాంక్స్ చెప్పింది.
*  ప్రస్తుతం సాయితేజ్ హీరోగా 'రిపబ్లిక్' చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత జె.పుల్లారావు త్వరలో పవన్ కల్యాణ్ తో ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయం గురించి ఆయన చెబుతూ, పవన్ కోసం అద్భుతమైన స్క్రిప్టును తయారుచేశామనీ, తమ జేబీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ కి వెళుతుందని తెలిపారు.
*  నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'థ్యాంక్యూ' చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. కొవిడ్ పరిస్థితులలో సైతం కొన్ని ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ కోసం యూనిట్ అక్కడకు వెళ్లింది.