డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్‌ డెలివరీపై అధ్యయనం చేయనున్న ఐసీఎంఆర్‌

22-04-2021 Thu 21:35
  • అనుమతి నిచ్చిన పౌర విమానయాన శాఖ
  • ఐఐటీ కాన్పూర్‌తో కలిసి అధ్యయనం
  • ఏడాది పాటు అమల్లో ఉండనున్న ఉత్తర్వులు
ICMR Gets Nod To Study Drones For Delivering Covid Vaccine

డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్లను అందజేసే విధానంపై అధ్యయనం చేసేందుకు పౌర విమానయాన శాఖ ఐసీఎంఆర్‌కు అనుమతి నిచ్చింది. ఐఐటీ కాన్పూర్‌తో కలిసి ఐసీఎంఆర్‌ ఈ  అధ్యయనం జరపనుంది. ‘అన్‌మ్యాన్‌డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టం(యూఏఎస్‌) నిబంధనలు, 2021’ నుంచి షరతులతో కూడిన మినహాయింపునిస్తూ ఈ అనుమతిని  జారీ చేశామని కేంద్రం తెలిపింది. ఈ అనుమతులు ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అమల్లో వుంటాయి. వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా సరఫరా చేయడం సాధ్యం అవుతుందా? లేదా? అన్న విషయాన్ని ఈ అధ్యయనంతో తేల్చనున్నారు.