UAE: భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన యూఏఈ!

  • ఇండియాలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
  • విమాన రాకపోకలపై 10 రోజుల నిషేధం విధించిన యూఏఈ
  • భారత్ మీదుగా ప్రయాణించిన వారు యూఏఈలో ప్రవేశించవద్దని ఆంక్షలు
UAE bans planes from India

మన దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 3 లక్షలకు పైగా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వచ్చినప్పటి నుంచి ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో పలు దేశాలు భారత్ నుంచి వచ్చే విమాన రాకపోకలపై ఇప్పటికే నిషేధం విధించాయి.

తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలను 10 రోజుల పాటు నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, యూఏఈ మరో సంచలన ప్రకటన చేసింది. భారత్ మీదుగా గత 14 రోజుల్లో ప్రయాణించినవారెవరూ యూఏఈలో అడుగు పెట్టవద్దని ప్రకటించింది.

More Telugu News