రాంచరణ్ వ్యానిటీ డ్రైవర్ కరోనాతో మృతి

22-04-2021 Thu 19:28
  • ఇటీవలే కరోనా బారిన పడిన చరణ్ డ్రైవర్ జయరాం
  • ఐసొలేషన్ లో ఉన్న చరణ్
  • చరణ్ కోవిడ్ టెస్టులు చేయించుకోనున్నట్టు సమాచారం
Ram Charan driver died with Corona

భారత్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాలపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. టాలీవుడ్ లో కూడా ఇప్పటికే ఎందరో కరోనా బారిన పడ్డారు. రాంచరణ్ వ్యానిటీ డ్రైవర్ జయరాంకు ఇటీవల కరోనా సోకింది. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆయన ఈరోజు మృతి చెందారు.

మరోవైపు జయరాంకు కరోనా సోకిన సంగతి తెలిసిన వెంటనే చరణ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయాడు. జయరాం మృతి చెందిన నేపథ్యంలో, చరణ్ కోవిడ్ టెస్టులు చేయించుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే చరణ్ ఒకసారి కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు మహేశ్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కు కూడా కరోనా సోకడంతో... ఆయన కూడా ఐసొలేషన్ లో ఉన్నారు.