ఏపీని వణికిస్తున్న కరోనా.. ఒక్కరోజులోనే 11 వేల వరకు కేసుల నమోదు!

22-04-2021 Thu 19:14
  • 24 గంటల్లో 10,759 కేసుల నమోదు
  • కరోనా వల్ల 31 మంది మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 66,944 
Andhra Pradesh registers 10759 cases in 24 hours

ఏపీలో కరోనా కేసులు భారీగా వ్యాపిస్తున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 10,759 పాజిటివ్ కేసులు నమోదు కావడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఇదే సమయంలో 31 మంది కరోనా వల్ల మృతి చెందారు. 3,992 మంది కరోనా నుంచి బయటపడ్డారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 9,97,462 మంది కరోనా బారిన పడగా.. 9,22,977 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 66,944 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 7,541 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.