Australia: మీ బెదిరింపులకు భయపడం: చైనాకు ఆస్ట్రేలియా కౌంటర్

  • చైనా బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమానికి మేము విరుద్ధం
  • ఇలాంటి విధానాలకు మేము మద్దతు పలకం
  • చైనా యత్నాలను అనుమతించబోము
Australia gives counter to China

తమ బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమాన్ని ఆస్ట్రేలియా ఊహించని విధంగా పక్కన పెట్టడంపై చైనా కారాలు, మిరియాలు నూరుతోంది. ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం ఇరు దేశాల మధ్య సంబంధాలపై తీరని విఘాతాన్ని కలిగిస్తుందని ఈరోజు చైనా వ్యాఖ్యానించింది. చైనా హెచ్చరికలపై ఆస్ట్రేలియా అంతే స్థాయిలో స్పందించింది. చైనా బెదిరింపులకు తాము తలొగ్గబోమని వ్యాఖ్యానించింది.

చైనా బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమంలో తాము భాగస్వాములు కాలేమని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. తమ విదేశాంగ విధానానికి చైనా చేపట్టిన కార్యక్రమం విరుద్ధమని చెప్పింది. ఇలాంటి విధానాలకు తాము మద్దతు పలకబోమని తేల్చి చెప్పింది. చైనా యత్నాలను తాము అనుమతించబోమని స్పష్టం చేసింది.

మరోవైపు ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కు చైనానే కారణమని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. ఇదే సమయంలో చైనా  టెలికాం సంస్థ హువాయి తమ దేశంలో చేపట్టిన 5జీ నెట్ వర్క్ పనులను కూడా ఆస్ట్రేలియా ఆపేసింది. అంతేకాదు, తమ దేశంలోని చైనా పెట్టుబడులపై కూడా ఆస్ట్రేలియా పునరాలోచిస్తోంది. చైనా కార్యకలాపాలకు పూర్తిగా చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది.

More Telugu News