Nara Lokesh: విద్యార్థులకు కరోనా సోకితే జగన్ బాధ్యత తీసుకుంటారా?: నారా లోకేశ్

  • పరీక్షలు నిర్వహిస్తే 80 లక్షల మంది కరోనా బారిన పడే అవకాశం ఉంది
  • పరిస్థితులను ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు
  • అనేక రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేస్తున్నాయి
Will Jagan takes responsibility if students get Corona questions Nara Lokesh

ఏపీలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు కరోనా సోకి, ఆ తర్వాత వాళ్ల కుటుంబ సభ్యులు మహమ్మారి బారిన పడితే ముఖ్యమంత్రి జగన్ బాధ్యత తీసుకుంటారా? అని ప్రశ్నించారు.

పరీక్షలను నిర్వహిస్తే 80 లక్షల మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈరోజు ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలతో ఆన్ లైన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రమాదకర పరిస్థితులను అర్థం చేసుకోకుండా ప్రభుత్వం మొండిగా పరీక్షలను నిర్వహించాలనుకుంటోందని దుయ్యబట్టారు. అనేక రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేస్తుంటే... ఏపీలో మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉందని అన్నారు. ప్రభుత్వంలో మార్పు రాకపోతే కరోనాను కట్టడి చేయడం చాలా కష్టమవుతుందని చెప్పారు.

More Telugu News