COVID19: వ్యాక్సిన్ న్యూస్: 18 ఏళ్లు నిండిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

  • విశ్వరూపాన్ని చూపిస్తున్న సెకండ్ వేవ్ 
  • వ్యాక్సినేషన్ పరిధి పెంచిన కేంద్ర ప్రభుత్వం
  • మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్
  • కొవిన్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం  
Registrations start from Saturday for above eighteen years

దేశంలో సెకండ్ వేవ్ లో కరోనా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. నిన్న సుమారు మూడు లక్షల పదిహేను వేల కొత్త కేసులు నమోదయ్యాయంటే ఈ మహమ్మారి  విజృంభణ ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. ఇది ఇంకా తీవ్ర స్థాయికి చేరుతుందని ఓ పక్క నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఇప్పటివరకు 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వగా.. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ను వేయనున్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ కు అర్హులైన వారిని ఈ నెల 28 నుంచి కొవిన్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా కేంద్రం కోరింది.

కాగా, ఇప్పటికే మన దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉండగా.. త్వరలో రష్యా తయారీ 'స్పుత్నిక్ వి' కూడా రానుంది. వ్యాక్సినేషన్ పరిధిని పెంచిన నేపథ్యంలో ఆయా వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నారు. దేశంలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ అందితే కనుక హెర్డ్ ఇమ్యూనిటీ రావడానికి ఆస్కారం ఉంటుందని వైరాలజిస్టులు పేర్కొంటున్నారు.

More Telugu News