చిరంజీవి చిన్న అల్లుడికి కరోనా పాజిటివ్

22-04-2021 Thu 15:01
  • కల్యాణ్ దేవ్ కు కరోనా పాజిటివ్
  • స్వల్ప లక్షణాలు ఉన్నాయన్న కల్యాణ్
  • హాస్పిటల్ లో క్వారంటైన్ లో ఉన్నానని వెల్లడి
Chiranjeevi son in law Kalyan Dev tested with Corona positive

కరోనా వైరస్ ప్రభావం చాలా దారుణంగా ఉంది. ఊహించని స్థాయిలో వేగంగా విస్తరిస్తూ వైరస్ కోరలు చాస్తోంది. ఎందరో ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కు కరోనా సోకింది. తనకు కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని కల్యాణ్ దేవ్ తెలిపాడు. హాస్పిటల్ లో క్వారంటైన్ లో ఉన్నానని చెప్పాడు. త్వరలోనే తాను పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానని ట్వీట్ చేశాడు. అందరి ప్రేమకు ధన్యవాదాలు చెపుతున్నానని చెప్పాడు.