క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో డీజీపీ, ఉన్న‌తాధికారుల‌తో ఏపీ మంత్రి వర్గ ఉప సంఘం భేటీ

22-04-2021 Thu 13:43
  • మంగళగిరి ఏపీఐఐసీ ఆఫీసులో సమావేశం
  • మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో చ‌ర్చ‌లు
  • పాల్గొన్న బొత్స‌, ఆదిమూలపు, కన్నబాబు  
ap cabinet sub committee meets

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో దాని క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై మంగళగిరి ఏపీఐఐసీ ఆఫీసులో వైద్యా ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో మంత్రి వర్గ ఉప సంఘం స‌మావేశ‌మైంది. ఇందులో స‌భ్యులుగా ఉన్న‌ మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్‌, కన్నబాబు కూడా స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.

క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై  డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇతర ఉన్నతాధికారుల‌తో క‌లిసి మంత్రులు చ‌ర్చిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా రోగుల‌కు పడకలు, ఆక్సిజన్‌, వైద్య నిపుణుల నియామకం, ఇత‌ర సౌక‌ర్యాలను అందుబాటులోకి తీసుకు రావ‌డంపై వారు చ‌ర్చలు జ‌రుపుతున్నారు. అలాగే, క‌రోనా విజృంభ‌ణ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్ష‌లు విధించే అంశంపై కూడా వారు చ‌ర్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది.