Rahul Gandhi: దేశంలో క‌రోనా ప‌రిస్థితులు ఆందోళ‌న‌కరంగా ఉన్నాయి: రాహుల్ గాంధీ

  • దేశం నలుమూలల నుంచి ప్ర‌తిరోజు బాధాకరమైన వార్తలు
  • ఈ క్లిష్ట‌ పరిస్థితులకు కారణం కొవిడ్ మాత్ర‌మే కాదు
  • కేంద్ర ప్ర‌భుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు కూడా  
rahul gandhi slams govt

దేశ వ్యాప్తంగా క‌రోనా ఉద్ధృతి ఊహించ‌ని రీతిలో పెరిగిపోతోన్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాహుల్‌కి కూడా క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని, అయితే, దేశం నలుమూలల నుంచి ప్ర‌తిరోజు బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్రస్తుతం దేశంలో క‌రోనా ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్నాయ‌ని రాహుల్ అన్నారు.  దేశంలో నెల‌కొన్న ఈ క్లిష్ట‌ పరిస్థితులకు కారణం కొవిడ్ మాత్ర‌మే కాదని, కేంద్ర ప్ర‌భుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు కూడా అని ఆయ‌న మండిప‌డ్డారు. టీకా ఉత్స‌వ్ వంటి పనికిరాని ఉత్సవాలు, ఒట్టి మాట‌లను క‌ట్ట‌బెట్టి ప్ర‌స్తుతం నెల‌కొన్న‌ సంక్షోభానికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంద‌ని ఆయ‌న చెప్పారు.  

More Telugu News