Maoist: 26న భారత్ బంద్.. పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ

  • మావోయిస్టు ఉద్యమంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్బంధకాండ
  • ఉద్యమాన్ని నిర్మూలించే ప్రయత్నం
  • లేఖలో ఆరోపించిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి కైలాసం
Maoist Party called for Bharat Bandh On 26th April

ఈ నెల 26న దేశవ్యాప్త బంద్‌కు సీపీఐ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి కైలాసం పేరుతో ఓ లేఖ విడుదలైంది. చత్తీస్‌గఢ్‌లో ప్రహార్-3 పేరుతో ఆదివాసీలు, మావోయిస్టు ఉద్యమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేత ధోరణి అవలంబిస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా ఈ నెల 26న దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రులు జగన్, నవీన్ పట్నాయక్ మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో నిర్బంధకాండ కొనసాగుతోందని కైలాసం ఆ లేఖలో ఆరోపించారు.

  • Loading...

More Telugu News