కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పెద్దన్నయ్య కన్నుమూత

22-04-2021 Thu 07:20
  • అనారోగ్యంతో బాధపడుతున్న యాదగిరి రెడ్డి
  • పరిస్థితి విషమించడంతో గత రాత్రి మృతి
  • కిషన్‌రెడ్డిని పరామర్శించిన నేతలు
Union Minister Kishan Reddy Brother Passed Away
తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి పెద్దన్నయ్య యాదగిరిరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గత  కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని తన నివాసంలో గత రాత్రి తుదిశ్వాస విడిచారు. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి కిషన్‌రెడ్డి తిమ్మాపూర్ చేరుకున్నారు. యాదగిరిరెడ్డి మృతి విషయం తెలిసిన పలువురు నేతలు కిషన్‌రెడ్డిని పరామర్శించారు.