YS Sharmila: కరోనా ఎఫెక్ట్.. రిలే నిరాహార దీక్షలు వాయిదా వేసిన షర్మిల

  • కార్యకర్తలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం
  • నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేందుకు దీక్షలు
  • ఉద్యోగాలు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ
YS Sharmila postponed Riley Strikes

తెలంగాణలో కరోనా రెండో దశ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఉద్యోగ సాధన రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆమె కార్యాలయం తెలిపింది. కార్యకర్తలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది.

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని షర్మిల స్పష్టం చేశారు. గత ఆరేళ్ల కాలంలో ఉద్యోగ నియామకాల విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీంతో యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలిచి , భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే దీక్ష చేపట్టినట్టు తెలిపారు.

More Telugu News