Maharashtra: కరోనా కట్టడి కోసం మరిన్ని కఠిన ఆంక్షలు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం

  • ప్రజా రవాణాపై నియంత్రణ
  • ప్రైవేటు, ప్రభుత్వ బస్సుల్లో 50 శాతం ఆక్సుపెన్సీ 
  • వివాహాలకు 25 మందికి మాత్రమే అనుమతి
  • ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 15 శాతం సిబ్బంది మాత్రమే
Maharashtra announced still more stricter Sanctions to curb the virus

కరోనా కట్టడి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. ‘బ్రేక్‌ ద చైన్‌’ (కరోనా గొలుసును తుంచేయండి) పేరిట పలు మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిలో ముఖ్యమైనవి..

* ప్రభుత్వ(కేంద్ర, రాష్ట్ర), ప్రైవేటు కార్యాలయాలు కేవలం 15 శాతం మంది సిబ్బందితోనే పనిచేయాలి.

* అత్యవసర సేవలు అందించే విభాగాలు కూడా కనీస సిబ్బందితో పనిచేయాలి. ఏ సమయంలోనూ 50 శాతానికి మించి విధుల్లో ఉండకూడదు.

* వివాహాలకు కేవలం 25 మందికి మాత్రమే అనుమతి. ఒకేరోజు, ఒకే హాల్లో రెండు గంటలకు మించి ఈ కార్యక్రమం జరగకూడదు.

* ప్రైవేటు వాహనాలను(బస్సులకు మినహాయింపు) అత్యవసర సేవలకు మాత్రమే వినియోగించాలి. లేదా సరైన కారణం ఉండాలి. అదీ డ్రైవర్‌తో కలిపి వాహన సీటింగ్‌ సామర్థ్యంలో 50 శాతం మంది మాత్రమే ఉండాలి. నగరాల మధ్య, జిల్లాల మధ్య ప్రయాణించేందుకు ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదు. ఈ నిబంధనను అతిక్రమిస్తే రూ.10,000 జరిమానా.

* ప్రైవేటు బస్సులను 50 శాతం ఆక్సుపెన్సీతో మాత్రమే నడపాలి. ఎవరూ నిలబడి ప్రయాణించకూడదు. జిల్లాలు, నగరాల మధ్య నడిచే బస్సులు కేవలం రెండు చోట్ల మాత్రమే ఆపాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10,000 జరిమానా. అవసరమైతే లైసెన్స్‌ రద్దు.

*  ప్రజా రవాణాను కేవలం ప్రభుత్వ, వైద్యారోగ్య సిబ్బంది కోసం మాత్రమే వినియోగించాలి. లేదా ఎవరికైనా వైద్య సాయం కావాలంటే వారికోసం నడపవచ్చు. వీటిలో ప్రయాణించేవారందరికీ సరైన గుర్తింపు కార్డు ఉండాలి.

* ప్రభుత్వ బస్సులు సైతం కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే నడవాలి. ఎవరూ నిలబడి ప్రయాణించకూడదు.

మహారాష్ట్రలో కరోనా భారీ స్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 67 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 568 మంది మరణించారు.

More Telugu News