కరోనా పేషెంట్ల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం సరికాదు: ఏపీ మంత్రి బుగ్గన

21-04-2021 Wed 22:11
  • కరోనాను కట్టడి చేసిన జిల్లాగా కర్నూలు నిలిచింది
  • ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువ ఫీజులు వసూలు చేయకుండా కమిటీని ఏర్పాటు చేశాం
  • ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం
Take action against highest fess collecting hospitals says Minister Buggana

కర్నూలు జిల్లాలో కరోనా కట్టడిపై ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా పేషెంట్ల నుంచి ప్రైవేటు ఆసుపత్రులు అధిక మొత్తంలో వసూలు చేయడం సరికాదని ఆయన అన్నారు. కరోనాను సమర్థవంతంగా కట్టడి చేసిన జిల్లాగా కర్నూలు నిలిచిందని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఛార్జీలు వసూలు చేయకుండా కట్టడి చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. అధిక ఛార్జీలు వసూలు చేసినట్టు సమాచారం అందగానే కమిటీ స్పందించి, సంబంధిత ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.