సోషల్ మీడియా నుంచి వైదొలగిన చార్మి!

21-04-2021 Wed 21:17
  • కరోనా వార్తలు, దృశ్యాలను చూడలేకపోతున్నాను
  • కరోనా పరిస్థితులను చూసి తట్టుకునే పరిస్థితి నాకు లేదు
  • దేశంలో కరోనా పరిస్థితి దారుణంగా ఉంది
Actress Charmi quits social media

ఎన్నో సినిమాలలో నటించి, తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న చార్మి... కొంత కాలంగా నటనకు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. దర్శకనిర్మాత పూరీ జగన్నాథ్ తో కలిసి నిర్మాణ రంగంలోకి దిగింది. తాజాగా చార్మి ఊహించని నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్టు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

సోషల్ మీడియాలో కరోనా వార్తలు, దృశ్యాలను చూడలేకపోతున్నానని చార్మి తెలిపింది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని చెప్పింది. కరోనా పరిస్థితులను చూసి తట్టుకునే పరిస్థితి తనకు లేదని... అందుకే సోషల్ మీడియాకు గుడ్ బై చెపుతున్నానని తెలిపింది.

మన దేశ పరిస్థితి దారుణంగా ఉందని... ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ మీరు ప్రేమించిన వ్యక్తులను జాగ్రత్తగా చూసుకోవాలని చార్మి కోరింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆకాంక్షించింది.