Congress: కాంగ్రెస్‌‌ ఎంపీ శశి థరూర్‌కు కరోనా!

Congress mp shashi tharoor tests positive
  • తల్లితో కలిసి ఏప్రిల్‌ 8న రెండో డోసు
  • కాలిఫోర్నియాలో తన సోదరి ఫైజర్‌ టీకా తీసుకుందని వెల్లడి
  • నిర్థారణ పరీక్షల కోసం 2 రోజులు వేచిచూడాల్సి వచ్చిందన్న ఎంపీ
దేశవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితాలో తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ కూడా చేరారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. తాను, 85 ఏళ్ల తన తల్లి, తన సోదరి కూడా కరోనా బారిన పడ్డామని ఆయన పేర్కొన్నారు.

సరిపడా విశ్రాంతి, ఆవిరి, ఫ్లూయిడ్స్‌తో పాటు సానుకూల దృక్పథంతో కరోనాను ఎదుర్కొంటానని తెలిపారు. రెండు రోజుల నిరీక్షణ తర్వాత తనకు పరీక్ష చేయించుకునేందుకు అపాయింట్‌మెంట్‌ దొరికిందని.. తర్వాత మరో ఒకటిన్నర రోజులు వేచి చూసిన తర్వాత ఫలితాలు వచ్చాయని తెలిపారు.

అలాగే కాలిఫోర్నియాలో తన సోదరి ఫైజర్‌ టీకా రెండు డోసులు తీసుకున్నారని శశి థరూర్‌ తెలిపారు. అలాగే ఇక్కడ తాను, తన తల్లి కొవిషీల్డ్‌ టీకా రెండో డోసు ఏప్రిల్‌ 8న తీసుకున్నట్లు వెల్లడించారు. అయినప్పటికీ తమకు కరోనా సోకిందని అన్నారు. ఈ నేపథ్యంలో టీకాలు కరోనా ఇన్‌ఫెక్షన్‌ను పూర్తిగా నిలువరించనప్పటికీ.. వైరస్‌ ప్రభావాన్ని మాత్రం నియంత్రిస్తాయని ఆశించవచ్చన్నారు.
Congress
Corona Virus
COVID19
Corona vaccine

More Telugu News